చ‌ర్చ‌ల్లో ర‌ష్యా, ఉక్రెయిన్ల డిమాండ్లు ఇవే!

  • బెలార‌స్‌లో ఇరు దేశాల శాంతి చ‌ర్చ‌లు
  • నాటోలో చేర‌బోమ‌ని ఉక్రెయిన్ హామీ ఇవ్వాల‌న్న ర‌ష్యా
  • బ‌ల‌గాల‌ను ర‌ష్యా వెన‌క్కు పిలవాలంటున్న ఉక్రెయిన్‌
  • త‌క్ష‌ణ‌మే ర‌ష్యా కాల్పుల‌ను నిల‌పాల‌ని కూడా డిమాండ్‌
యుద్ధంలో ఒకరికి ఒకరు త‌గ్గ‌కుండా ముందుకు సాగుతున్న ర‌ష్యా, ఉక్రెయిన్లు ఎట్ట‌కేల‌కు శాంతి చ‌ర్చ‌ల‌కు అంగీక‌రించాయి. ర‌ష్యా ప్ర‌తిపాదించిన‌ట్లుగానే బెలార‌స్‌లో కాసేప‌టి క్రితం ప్రారంభ‌మైన చ‌ర్చ‌ల్లో ఇరు దేశాల ప్ర‌తినిధులు పాల్గొన్నారు. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు కొన‌సాగుతుండ‌గా.. ఇరు దేశాలు త‌మ త‌మ వాద‌న‌ల‌కు క‌ట్టుబ‌డి.. వాటిని సాధించుకునే దిశగా ముందుకు సాగుతున్నాయి. 

నాటో కూట‌మిలో చేర‌బోన‌ని ఉక్రెయిన్ బేష‌ర‌తుగా లిఖిత పూర్వ‌క హామీ ఇవ్వాల‌ని ర‌ష్యా ప‌ట్టుబ‌డుతోంది. అయితే ఇత‌ర విషయాలేమీ ప్రస్తావించని ఉక్రెయిన్‌.. త‌క్ష‌ణ‌మే ర‌ష్యా త‌న బ‌ల‌గాల‌ను వెన‌క్కు పిల‌వాల‌ని పట్టుబ‌డుతోంది. అంతేకాకుండా ర‌ష్యా త‌క్ష‌ణ‌మే కాల్పుల‌ను విర‌మించాల‌ని కూడా ఉక్రెయిన్ తేల్చిచెబుతోంది. వెర‌సి ఇరు దేశాలు ప్ర‌త్య‌ర్థి ప్ర‌తిపాద‌న‌ల‌పై ఎలాంటి స్పంద‌న తెలిజేయ‌కుండా.. త‌మ త‌మ వాద‌న‌ల‌ను వినిపించేందుకే మొగ్గు చూపుతున్నాయి. ఇలాంటి త‌రుణంలో ఈ చ‌ర్చ‌ల ఫ‌లితం ఎలా ఉంటుందోన‌న్న విష‌యంలో ఆసక్తి నెల‌కొంది.


More Telugu News