'భీమ్లా నాయక్' సక్సెస్ పై మంచు మనోజ్ స్పందన

  • నేను అభిమానించే ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు
  • సినిమా హిట్ కావడం సంతోషంగా ఉంది
  • పవన్ కల్యాణ్, రానాకు శుభాకాంక్షలన్న మనోజ్ 
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్లో వచ్చిన 'భీమ్లా నాయక్' సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సక్సెస్ ఎంజాయ్ చేస్తోంది. సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. మరోవైపు ఈ సినిమా విజయంపై హీరో మంచు విష్ణు స్పందించాడు. సింగిల్ ఫ్రేమ్ లో తాను ఎంతో అభిమానించే ఇద్దరు వ్యక్తులను చూడటం సంతోషంగా ఉందని అన్నాడు. 'భీమ్లా నాయక్' సక్సెస్ కు సంబంధించి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పాడు. సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా పవన్ కల్యాణ్ అన్న, డార్లింగ్ రానా, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, మొత్తం టీమ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.


More Telugu News