అప్పటి వరకు అది బీర్.. యుద్ధం మొదలైన తర్వాత అది ‘ఆయుధం’!

  • లివ్ లోని ప్రావ్డా బ్రూవరీ తయారీ
  • మొలటోవ్ కాక్ టెయిల్ తయారీ
  • మండే స్వభావంతో కలిగినది
  • రష్యా దళాలకు సరఫరా
ఉక్రెయిన్ లోని లివ్ పట్టణానికి చెందిన ప్రావ్డా బ్రూవరీ బీర్ల తయారీకి ప్రసిద్ధి. కానీ, ఇప్పుడు ఆ కంపెనీ పోషిస్తున్న పాత్ర వేరు. రష్యా యుద్ధాన్ని అడ్డుకునేందుకు పోరాడుతున్న ఉక్రెయిన్ దళాలకు మద్దతుగా ‘మొలటోవ్ కాక్ టెయిల్’ బాంబులను తయారు చేసి సరఫరా చేస్తోంది. 

మొలటోవ్ కాక్ టెయిల్ అన్నది బీరులానే గాజు సీసాలో ఉంటుంది. లోపల ఉండే కాక్ టెయిల్ పెట్రోల్, ఆల్కహాల్ మాదిరే మండే స్వభావంతో ఉంటుంది. సీసా మూతభాగంలో ఉన్న వస్త్రానికి అగ్గి రాజేసి శుత్రు సేనలపై విసిరి కొడితే అవతలి వారు గాయాల పాలు కావాల్సిందే. 

‘‘ఈ యుద్ధానికి మద్దతుగా మేము మా వంతుగా ప్రతిదీ చేస్తాం. ఎవరో ఒకరు దీన్ని చేయాలి. 2014లోనూ దీన్ని తయారు చేసి వినియోగించిన దాఖలాలున్నాయి. 2014 నాటి పోరులో పాల్గొన్న మా ఉద్యోగి ఒకరికి మెలటోవ్ కాక్ టెయిల్ తయారీ గురించి తెలుసు. అందుకే దీన్ని తయారు చేయడం మొదలు పెట్టాం’’ అని ప్రావ్డా బ్రూవరీ యజమాని యూరీ జాస్టనీ తెలిపారు.


More Telugu News