కాసేప‌ట్లో మంత్రులు, అధికారుల‌తో సీఎం కేసీఆర్ కీలక భేటీ

  • అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలపై చ‌ర్చ‌
  • తేదీల‌ను ఖ‌రారు చేసే అవ‌కాశం
  • అన్ని శాఖల నుంచీ ప్రతిపాదనల స్వీకరణ 
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కాసేప‌ట్లో మంత్రులు, అధికారుల‌తో కీల‌క స‌మావేశం ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ ఉన్న‌త‌స్థాయి స‌మావేశంలో తెలంగాణ‌ ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్ రావు, శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డితో పాటు ప‌లువు‌రు మంత్రులు, ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి, సీఎంవో అధికారులు పాల్గొన‌నున్నారు. 

 కాగా, ఈ సమావేశంలో అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల తేదీల‌ను ఖ‌రారు చేసే అవ‌కాశం ఉంది. ఆ త‌ర్వాత దీనిపై ప్ర‌క‌ట‌న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే బ‌డ్జెట్ కోసం అన్ని శాఖల అధికారుల నుంచి ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న‌లు స్వీక‌రించింది.  

ఇదిలావుంచితే, షెడ్యూల్ ప్ర‌కారం వ‌చ్చే ఏడాది చివ‌ర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. అయితే, ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశం కూడా ఉంద‌ని కొన్ని రోజుల నుంచి ఊహాగానాలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లో ప్ర‌వేశ పెట్టే బ‌డ్జెట్ ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంద‌ని అంచనాలు నెల‌కొన్నాయి.


More Telugu News