రాజ్యాంగంపై దొర‌గారు మొసలి కన్నీరు కార్చారు.. మ‌రి మీ అధీనంలో ఉన్న దీనిపై ఏం చేస్తున్నారు?: ష‌ర్మిల‌

  • ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సగం కూడా ఖర్చు చేయలేదు
  • మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశారు
  • ఎన్నికల కోసమే దళితబంధు తీసుకొచ్చారు
  • దళితులకు జరుగుతున్న అన్యాయం గుర్తుకు రాలేదా? అన్న షర్మిల 
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మండిప‌డ్డారు. 'స‌గ‌మ‌న్నా ఖ‌ర్చు చేయ‌లే' పేరిట ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన ఓ క‌థ‌నాన్ని ఆమె పోస్ట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ నిధుల కథ మళ్లీ మొదటికొచ్చిందని, స్పెషల్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఫండ్స్‌‌‌‌‌‌‌‌ను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయ‌ట్లేద‌ని అందులో పేర్కొన్నారు. 

ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చినా 50 శాతం నిధులు కూడా ఖర్చు చేయలేదని, బడ్జెట్‌‌‌‌‌ స‌మ‌యంలో ఎంతో గొప్పగా నిధులు కేటాయిస్తున్నట్లు కేసీఆర్ ప్ర‌భుత్వం చెప్పుకుంటున్న‌ప్ప‌టికీ అనంత‌రం నిధులు మాత్రం విడుద‌ల చేయడం లేద‌ని ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు. త్వరలో తెలంగాణ‌ కొత్త బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను ప్రవేశపెట్టనున్న నేప‌థ్యంలో ఈ క‌థ‌నాన్ని ప్ర‌చురించారు. ఆయా అంశాల‌ను ష‌ర్మిల ప్ర‌స్తావించారు. 

''ఇప్పుడున్న రాజ్యాంగంతో దళితుల జనాభాకు తగ్గట్టుగా న్యాయం చేయలేకపోతున్నామని మొసలి కన్నీరు కార్చిన దొరగారు, మీ అధీనంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సగం కూడా ఖర్చు చేయకుండా పక్కదారి పట్టించినపుడు, మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేసినపుడు, ఎన్నికల కోసమే దళితబంధు పెట్టి అమలుచేయనప్పుడు దళితులకు జరుగుతున్న అన్యాయం గుర్తుకు రాలేదా?

మీరు దళితులకు చేసిన మోసాలు కనపడకూడదని, దళితుల మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తూ కొత్త రాజ్యాంగం కావాలని నీతులు చెబుతున్నారు. రాజ్యాంగాన్ని మార్చుడు కాదు, ఉన్న రాజ్యాంగంలో దళితుల హక్కులు అమలు చెయ్యండి. దళితుల పట్ల మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి'' అని ష‌ర్మిల పేర్కొన్నారు. కాగా, తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాలు త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్నాయి.


More Telugu News