100 కోట్ల క్లబ్ లో చేరిపోయిన 'వలిమై'

  • అజిత్ తాజా చిత్రంగా వచ్చిన 'వలిమై'
  • యాక్షన్ ప్రధానంగా నడిచే కథ 
  • తమిళనాట వసూళ్ల వర్షం 
  • తెలుగులో అంతగా కనిపించని రెస్పాన్స్
తమిళనాట అజిత్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. మాస్ ఆడియన్స్ తో సమానమైన ఫాలోయింగ్ ఆయనకి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉంది. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'వలిమై' ఈ నెల 24వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మించారు. 

తమిళనాట తొలి రోజునే ఈ సినిమా 36 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. వీకెండ్ లో ఈ సినిమా జోరు కొనసాగింది. ఒక్క తమిళనాడులోనే ఈ సినిమా 100 కోట్లకిపైగా వసూళ్లను సాధించిందని చెబుతున్నారు. అక్కడ మరికొన్ని రోజుల పాటు ఈ సినిమా హవానే కొనసాగుతుందని అంటున్నారు. ఎందుకంటే దగ్గరలో పెద్ద సినిమాలేవీ లేవు. 

ఇక తెలుగులో కూడా ఈ సినిమాను అదే టైటిల్ తో విడుదల చేశారు. కానీ ఇక్కడ అంతగా రెస్పాన్స్ కనిపించడం లేదు. అందుకు కారణంగా అందరి దృష్టి 'భీమ్లా నాయక్' పై ఉండటమే .. ఆ సినిమాకి హిట్ టాక్ రావడమే. వచ్చేనెల మొదట వారంలో ఈ సినిమాను రిలీజ్ చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


More Telugu News