యడ్లపాటి మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు: ధూళిపాళ్ల నరేంద్ర

  • నిన్న కన్నుమూసిన యడ్లపాటి వెంకట్రావు
  • ఆయనతో తమ కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉందన్న ధూళిపాళ్ల
  • టీడీపీ గొప్ప నేతను కోల్పోయిందని ఆవేదన
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై టీడీపీ నేత ధూళిపాళ్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణం వ్యక్తిగతంతా తనకు తీరని లోటు అని అన్నారు. తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి హయాం నుంచి తమ కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పారు. ఎన్జీ రంగా అడుగుజాడల్లో ఆయన నడిచారని... రైతు సమస్యలను అప్పటి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన రైతు నాయకుడు వెంకట్రావు అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ ఒక గొప్ప నేతను కోల్పోయిందని అన్నారు. 

సంగం డెయిరీకి వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన యడ్లపాటి ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా సేవలు అందించారు. 1967, 1972 ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ తరపున, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున వేమూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 1978-80 మధ్య కాలంలో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. 1983లో టీడీపీలో చేరిన యడ్లపాటి ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు.


More Telugu News