దసున్ షనక విధ్వంసక ఇన్నింగ్స్... గౌరవప్రద స్కోరు సాధించిన శ్రీలంక
- ధర్మశాలలో మూడో టీ20
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
- రాణించిన భారత బౌలర్లు
- 38 బంతుల్లో 74 పరుగులు చేసిన షనక
కెప్టెన్ దసున్ షనక భారత బౌలింగ్ పై విరుచుకుపడిన వేళ శ్రీలంక జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ధర్మశాలలో టీమిండియాతో మూడో టీ20 మ్యాచ్ లో శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసింది. ఓ దశలో శ్రీలంక జట్టు 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
అయితే దినేశ్ చాందిమల్ 25 పరుగులు చేయగా, కెప్టెన్ షనక శివాలెత్తిపోయాడు. 38 బంతుల్లోనే 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. షనక స్కోరులో 9 ఫోర్లు, 2 సిక్సులున్నాయి. లంక ఇన్నింగ్స్ లో ఓపెనర్లు నిస్సాంక (1), గుణతిలక (0), చరిత్ అసలంక (4,) జనిత్ లియనాగే (9) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 2, సిరాజ్ 1, హర్షల్ పటేల్ 1, రవి బిష్ణోయ్ 1 వికెట్ తీశారు.