ఏదైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోండి... బాక్సాఫీసు వద్ద కక్షసాధిస్తారా?: ప్రకాశ్ రాజ్
- ఇటీవల భీమ్లా నాయక్ విడుదల
- థియేటర్ల వద్ద టికెట్ల రేట్లపై ఏపీ సర్కారు నిఘా
- స్పందించిన ప్రకాశ్ రాజ్
- ప్రేక్షకుల అభిమానానికి అడ్డుకట్ట వేయలేరని వెల్లడి
పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ విడుదల సందర్భంగా ఏపీ ప్రభుత్వ వైఖరిపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సృజన, సాంకేతికత మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటి? అని మండిపడ్డారు. ఓవైపు చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూనే, తామే ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా? అని నిలదీశారు. ఏవైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలని, బాక్సాఫీసు వద్ద కక్షసాధింపులు ఎందుకని హితవు పలికారు.
ఎంతగా ఇబ్బందిపెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరూ అడ్డుకట్ట వేయలేరని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. భీమ్లా నాయక్ చిత్రంపై ఇకనైనా ఏపీ ప్రభుత్వం దాడిని ఆపాలని, సినిమా రంగాన్ని ఎదగనివ్వాలని విజ్ఞప్తి చేశారు.