ఉక్రెయిన్ యుద్ధాన్నీ వదలని వ్యాపారులు.. వంటనూనెల ధరలను అమాంతం పెంచేసిన వైనం
- రెండు గంటల వ్యవధిలో రూ. 20 పెరిగిన పామాయిల్ ధర
- రష్యా-ఉక్రెయిన్ యుద్ధమే కారణమంటున్న వ్యాపారులు
- నూనె మిల్లులన్నీ దేశంలోనే ఉన్నా ధరలెలా పెరిగాయో అర్థం కాక వినియోగారుల్లో అయోమయం
- ఎక్కడికక్కడ బోర్డులు తగిలించేసిన వ్యాపారులు
స్థానిక వ్యాపారులకు ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భలేగా కలిసొచ్చింది. ఎప్పుడు సందు దొరుకుతుందా? రేట్లు పెంచేద్దామా అని చూస్తున్న వ్యాపారాలకు రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం లాభాలు ఆర్జించి పెడుతోంది. యుద్ధంతో భారత్‌కు ఎలాంటి సంబంధాలు లేకున్నా.. నూనె మిల్లులన్నీ భారత్‌లోనే ఉన్నా వాటి ధరలు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో నూనె ధరలు గంటల వ్యవధిలోనే కిలోకు రూ. 20 వరకు పెరిగిపోయాయి.
శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో పామాయిల్ లీటర్ ధర రూ. 128 ఉండగా, మధ్యాహ్నం 12 గంటలకు ఏకంగా రూ. 149 అయింది. రెండు గంటల్లోనే ఏకంగా రూ. 21 పెరిగిపోవడం వినియోగాదారులను నివ్వెరపరిచింది. ఎందుకిలా అని ప్రశ్నించిన వినియోగదారులకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చెబుతున్నారు. యుద్ధం కారణంగా వంటనూనెల ధరలు పెరిగాయిని చెబుతుండడంతో వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు.
అంతేకాదు, కరోనా సమయానికి మించి ధరల పెరుగుదల ఉండే అవకాశం ఉందని భయపెడుతున్నారు. అక్కడే కాదు, విజయవాడ వ్యాప్తంగానూ ధరలు ఇలానే ఉన్నాయి. ఆయా దుకాణాల ముందు ధరలు పెరిగినట్టు బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ తన వెబ్‌సైట్‌లో పేర్కొన్న దానికి, ఏమాత్రం పొంతన లేకుండా ఉండడం గమనార్హం. నూనెల ధరల పెరుగుదలతో చిల్లర వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.