రాజ‌ధాని ఎక్క‌డో తెలియ‌ని రాష్ట్రంగా ఏపీ: బీజేపీ నేత రాంమాధ‌వ్‌

  • స్వాతంత్య్రం వ‌చ్చి75 ఏళ్లు అవుతున్నా స్వాభిమానం అల‌వాటు కాలేదు
  • విభ‌జ‌న జ‌రిగి ఏడేళ్లు గ‌డుస్తున్నా ఏపీ రాజ‌ధాని ఎక్క‌డో తెలియ‌దు
  • అవినీతి రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లే దీనికి కార‌ణమ‌న్న రాం మాధ‌వ్‌
దేశంలో రాజ‌ధాని ఎక్క‌డో తెలియ‌ని రాష్ట్రం ఏదైనా ఉందంటే..అది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఒక్క‌టేన‌ని బీజేపీ సీనియ‌ర్ నేత రాం మాధ‌వ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ త‌ర‌హా ప‌రిస్థితికి మ‌న రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో ఉన్న లోప‌మే కార‌ణ‌మని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. శ‌నివారం నాడు గుంటూరులో స‌మాలోచ‌న అనే సంస్థ స్వాధీన‌త నుంచి  స్వ‌తంత్ర‌త వైపు అనే అంశంపై నిర్వ‌హించిన స‌మావేశానికి హాజ‌రైన రాం మాధ‌వ్ కీల‌కోప‌న్యాసం చేశారు.

దేశంలో మంచి వ్య‌వ‌స్థ‌ల‌ను నెల‌కొల్పిన‌ప్పుడే ప్ర‌జ‌లు ఎక్క‌డ‌కు వెళ్లినా గౌర‌వం ల‌భిస్తుంద‌ని రాం మాధ‌వ్ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు గ‌డుస్తున్నా.. దేశ ప్ర‌జ‌ల‌కు ఇంకా స్వాభిమానం అల‌వాటు కాలేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనికి అవినీతి రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లే కార‌ణ‌మ‌ని ఆయ‌న అన్నారు. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఏడేళ్లు గ‌డుస్తున్నా కూడా ఏపీ రాజ‌ధాని ఎక్క‌డ ఉందో కూడా తెలియ‌ని పరిస్థితి నెల‌కొంద‌ని, దీనికి మ‌న రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లోని లోపం కార‌ణం కాదా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.


More Telugu News