దురాక్రమణకు పాల్పడని ఏకైక దేశం భారత్: రాజ్‌నాథ్ సింగ్
- ఏ దేశంపైనా దాడి చేయాలనుకోవడం లేదు
- ప్రపంచానికే భారత్ ఓ గురువుగా మారాలన్నదే మా కల
- ఢిల్లీ వర్సిటీ స్నాతకోత్సవంలో రాజ్ నాథ్ వ్యాఖ్యలు
ఉక్రెయిన్, రష్యాల మధ్య సాగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత్ వైఖరి ఏమిటన్న దానిపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ దేశంపై దాడి చేయడం గానీ, ఇతర దేశాల భూభాగాలపై దురాక్రమణకు పాల్పడటం గానీ చేయని ఏకైక దేశం భారతేనని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం జరిగిన ఢిల్లీ యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడులకు ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా రాజ్ నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత శక్తి ప్రపంచ సంక్షేమం కోసమేనన్న రాజ్‌నాథ్ సింగ్... ఆ శక్తి ఏ ఒక్కరినో భయపెట్టడానికి మాత్రం కాదని స్పష్టం చేశారు. ప్రపంచానికి గురువుగా మారాలన్నదే భారత్ కల అని, దేశం శక్తిమంతంగా మారి విజ్ఞానం, విలువలను కలిగి ఉండాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. అయితే ఇతర దేశాలపై దాడి చేయడం గానీ, దురాక్రమణకు పాల్పడటం గానీ ఎప్పుడూ భావించలేదని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.