శ్రీలంకలో భగ్గుమంటున్న చమురు ధరలు... లీటర్ పెట్రోల్ ధర రూ.204

  • శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం
  • గత నెలలో 25 శాతం పెరిగిన ద్రవ్యోల్బణం
  • కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న శ్రీలంక ఆర్థిక వ్యవస్థ
  • పర్యాటక రంగం కుదేలు
శ్రీలంకలో చమురు ధరలు కొండెక్కాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.20 పెరిగి రూ.204కి చేరింది. అదేబాటలో డీజిల్ ధర లీటర్ పై రూ.15 పెరిగి 139కి చేరింది. కరోనా సంక్షోభం కారణంగా తీవ్రంగా కుదేలైన దేశాల్లో శ్రీలంక కూడా ఒకటి. 

ప్రధానంగా పర్యాటక రంగం, ఎగుమతులపై ఆధారపడిన శ్రీలంక... కరోనా వ్యాప్తి కారణంగా పర్యాటకులు లేక, ఎగుమతులు ఆశించిన స్థాయిలో జరగక తీవ్ర నష్టాలు ఎదుర్కొంది. శ్రీలంకలో గత ఏడాది కాలంగా ఆహార, ఆర్థిక సంక్షోభం నెలకొంది. దిగుమతులపై నిషేధంతో దేశంలో నిత్యావసరాల ధరలు మరింత పెరిగాయి. గత నెలలో రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం 25 శాతం పెరిగింది.


More Telugu News