హైదరాబాదులో ఎక్కువ‌గా డ్ర‌గ్స్ వాడ‌కం ఎవ‌రిది? ఎక్క‌డ?.. పోలీసు లెక్క ఇది!

  • డ్ర‌గ్స్ వాడ‌కందారుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే అధికం
  • డ్ర‌గ్స్ అడ్డాగా సెంట్ర‌ల్ వ‌ర్సిటీ
  • హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్‌
భాగ్యన‌గ‌రి హైద‌రాబాద్‌ను మాద‌క‌ద్ర‌వ్యాల భూతం ప‌ట్టి పీడిస్తోంది. పోలీసులు ఎంత‌గా నిఘా పెట్టినా..నిత్యం ఎక్క‌డో ఒక చోట డ్ర‌గ్స్ బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి. న‌గ‌రానికి అన్ని  దిశ‌లా నిఘా పెంచినా..పోలీసుల క‌ళ్లు గ‌ప్పి డ్ర‌గ్స్ భాగ్య‌న‌గ‌రిలోకి ఎంట్రీ ఇస్తూనే ఉన్నాయి. మ‌త్తు లోకంలో విహ‌రింప‌జేసేలా చేస్తున్న ఈ డ్ర‌గ్స్ వాడ‌కానికి సంబంధించి హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ శ‌నివారం నాడు కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. 

డ్ర‌గ్స్ విక్ర‌యం, వాడ‌కానికి సంబంధించిన మూడు కేసుల్లో ఇటీవ‌లే 11 మందిని అరెస్ట్ చేసిన‌ట్లుగా సీవీ ఆనంద‌ర్‌ తెలిపారు. వీరిలో మెజారిటీ మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులేన‌ని ఆయ‌న పేర్కొన్నారు. న‌గ‌రంలోని సెంట్ర‌ల్ వర్సిటీ మాద‌క ద్ర‌వ్యాల‌కు అడ్డాగా మారిపోయింద‌ని కూడా ఆయ‌న సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించారు. సెంట్ర‌ల్ వ‌ర్సిటీలో వివిధ రాష్ట్రాల‌కు చెందిన విద్యార్థుల‌తో పాటుగా విదేశాల‌కు చెందిన విద్యార్థులు కూడా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ కార‌ణంగానే సెంట్ర‌ల్ వ‌ర్సిటీలో డ్ర‌గ్స్ వాడ‌కానికి కేంద్రంగా మారింద‌ని ఆయ‌న తెలిపారు. ఇక డ్ర‌గ్స్‌ను దిగుమ‌తి చేసుకోవ‌డం, విక్ర‌యించ‌డం, సేవించ‌డం వంటి వాటిలో ఇత‌ర రంగాల వారి కంటే సాఫ్ట్ వేర్ రంగానికిచెందిన వారే అధికంగా ఉన్నార‌ని క‌మిష‌న‌ర్ చెప్పారు.


More Telugu News