ఆల‌స్యంగా వ‌స్తే లీవ్‌లో ఉన్న‌ట్లే.. ఉద్యోగుల‌కు ఏపీ స‌ర్కారు షాక్‌

  • ఉదయం 10.10 లోగా వ‌స్తే ఒకే
  • లేదంటే సెల‌వు ప‌డిపోతుంది
  • 11 గంట‌ల్లోగా నెల‌కు మూడు రోజులు రావ‌చ్చు
  • ఆ ప‌రిమితి దాటితే.. వేత‌నంలో కొతేనంటున్న ప్రభుత్వం  
ఇప్ప‌టికే పీఆర్సీ విష‌యంలో ఏపీలోని వైసీపీ స‌ర్కారు వ్య‌వ‌హరించిన తీరుతో ఉద్యోగులు తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన సంగ‌తి తెలిసిందే. ఏదోలా ఆ స‌మ‌స్య తీరిపోయింద‌ని ఉద్యోగులు భావిస్తున్న‌ త‌రుణంలో వైసీపీ స‌ర్కారు ఉద్యోగుల‌కు మ‌రో షాకిచ్చింది. ప్ర‌భుత్వ ఉద్యోగులు స‌మ‌య‌పాల‌న పాటించాల్సిందేన‌ని, ఇక‌పై ఆల‌స్యంగా విధుల‌కు వ‌స్తే.. ఆ రోజున లీవ్ పెట్టిన‌ట్టుగానే ప‌రిగ‌ణించాల్సి వ‌స్తుంద‌ని ఏపీ ప్ర‌భుత్వం శనివారం నాడు ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

ఈ ఆదేశాలు అమ‌ల్లోకి వ‌స్తే.. ఉదయం 10 గంట‌ల‌కు కార్యాల‌యాల‌కు రావాల్సిన ఉద్యోగులు ఓ 10 నిమిషాల వ‌ర‌కు ఆల‌స్య‌మైతే ఫ‌ర‌వా లేదు గానీ.. అంత‌కు ఒక్క నిమిషం లేటైనా సెల‌వు ప‌డిపోతుంది. అంతేకాకుండా 10.10 గంట‌ల నుంచి 11 గంట‌ల మ‌ధ్య‌లో కార్యాల‌యానికి వ‌చ్చేందుకు నెల‌కు మూడు ప‌ర్యాయాలు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌ట‌. ఆ ప‌రిమితి దాటేస్తే.. ఇక వేత‌నంలో కోత మొద‌లైపోతుంద‌ట‌. ఈ మేర‌కు ఏపీ ఆర్ధిక శాఖ విడుద‌ల చేసిన ఉత్త‌ర్వుల‌పై ఇప్పుడు ఏపీ ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది.


More Telugu News