'రష్యా నుంచి కాపాడండి'.. భారత్‌కు మరోసారి ఫోన్ చేసిన ఉక్రెయిన్.. స్పందించిన భారత్
- భారత్‌కు ఉక్రెయిన్ విదేశాంగమంత్రి డిమిట్రో కులేబ ఫోన్
- రష్యాతో దౌత్యసంబంధాలను ఉపయోగించాలని విజ్ఞప్తి
- ఎలాగైనా రష్యా దాడులను ఆపాలని వినతి
- దౌత్యం, చర్చలే ఏ సమస్యకైనా పరిష్కారమన్న జైశంకర్
ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా కీవ్‌లో పాగా వేసిన విషయం తెలిసిందే. ఏ క్షణంలోనైనా ఉక్రెయిన్ ప్రభుత్వ అధికారిక క్వార్టర్స్‌ను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ సాయాన్ని ఉక్రెయిన్ మరోసారి కోరింది. ఉక్రెయిన్ విదేశాంగమంత్రి డిమిట్రో కులేబ తాజాగా భారత విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ కు ఫోన్ చేసి, రష్యాతో దౌత్యసంబంధాలను ఉపయోగించి ఎలాగైనా రష్యా తమదేశంపై చేస్తున్న దాడులను ఆపాలని కోరారు.
అలాగే, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్లో శాంతిస్థాపనకు ఉద్దేశించిన తీర్మానానికి మద్దతు తెలపాలన్నారు. ఆయా విషయాల్లో భారత్ తటస్థంగా ఉంటోన్న విషయం తెలిసిందే. దీంతో దౌత్యం, చర్చలే ఏ సమస్యకైనా పరిష్కార మార్గమని ఈ సందర్భంగా కులేబకు జైశంకర్ చెప్పారు. భారత్ దీన్నే విశ్వసిస్తుందని తెలిపారు. ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు సహకరిస్తున్నందుకు కులేబకు జైశంకర్ థ్యాంక్స్ చెప్పారు.