రంగు రంగుల విద్యుత్ కాంతుల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు... కానీ, యుద్ధ విమానాలు, ఫిరంగులు, బాంబుల మోత మధ్య ఒక్కటయ్యారు!
- యుద్ధం జరుగుతున్న సమయంలో పెళ్లితో ఒక్కటైన ఉక్రెయిన్ ప్రేమ జంట
- మే నెలలో పెళ్లి చేసుకోవాలని భావించిన జంట
- ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చనే భయంతో ఇప్పుడే పెళ్లి చేసుకున్న వైనం
ఓవైపు యుద్ధ సైరన్ మోగుతుండగా... మరోవైపు ఓ జంట వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. యారీనీ అరీవా (21), ఆమె ప్రియుడు స్వ్యాతోస్లావ్ ఫర్సిన్ (24) లు మే నెలలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని ఓ రెస్టారెంట్ టెర్రెస్ పై రంగురంగుల విద్యుత్ కాంతుల వెలుగుల్లో పెళ్లి చేసుకోవాలని తొలుత ప్లాన్ చేసుకున్నారు. అయితే ఉక్రెయిన్ లో పరిస్థితులు నానాటికీ దిగజారుతూ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రష్యా దాడులతో ఉక్రెయిన్ నెత్తురోడుతోంది.
ఈ నేపథ్యంలో రంగురంగుల విద్యుత్ కాంతుల మధ్య పెళ్లి చేసుకోవాలనుకున్న ఈ జంట... యుద్ధ విమానాలు, ఫిరంగులు, బాంబుల మోత మధ్య ఓ ప్రార్థనాలయంలో పెళ్లి చేసుకున్నారు. యుద్ధం నేపథ్యంలో రేపు ఏమి జరుగుతుందో ఊహించలేని పరిస్థితుల్లో తాము ఇప్పుడే పెళ్లి చేసుకున్నామని ఈ జంట తెలిపింది.
అరీవా కీవ్ సిటీ కౌన్సిల్ లో డిప్యూటీగా పని చేస్తుండగా, ఫర్సిన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. 2019లో జరిగిన ఓ నిరసన కార్యక్రమం సందర్భంగా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. పెళ్లి జరిగిన తర్వాత అరీవా మాట్లాడుతూ, 'పరిస్థితి భయానకంగా ఉంది. కానీ ఇది మా జీవితంలో సంతోషకరమైన సమయం. యుద్ధం కారణంగా మేము ఎప్పుడైనా చనిపోవచ్చు. కానీ, ఆ లోగానే మేము ఒకటవ్వాలని కోరుకున్నాం' అని తెలిపింది.