మాడి మసైపోయిన రష్యా సైనికులు.. ఉక్రెయిన్ రక్షణ శాఖ విడుదల చేసిన వీడియో ఇదిగో
- ఇర్పెన్–బూకా మధ్య ఉక్రెయిన్ సైనికుల ప్రతిదాడి
- పదుల సంఖ్యలో రష్యా సైనికుల మృతి
- మా దేశంలోకి వస్తే చావేనంటూ కామెంట్
ఉక్రెయిన్ లోకి చొరబడుతున్న రష్యా బలగాలను ఉక్రెయిన్ దళాలు దీటుగానే ఎదుర్కొంటున్నాయి. రష్యా సైనికుల చేతుల్లో చాలా మంది ఉక్రెయిన్ సోల్జర్లు చనిపోతున్నా.. మరికొన్ని చోట్ల దీటుగా బదులిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇర్పెన్ లో రష్యాకు చెందిన పలు యుద్ధ ట్యాంకులను బాంబులతో పేల్చేశారు. ఆ ఘటనలో పదుల సంఖ్యలో రష్యా సైనికులు కాలి బూడిదయ్యారు. ఆ వీడియోను ఉక్రెయిన్ రక్షణ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ‘తమ భూభాగంలోకి ఎవరైనా చొరబడితే వారికి చావే’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
నిన్న గోస్టోమెల్ కు సమీపంలోని ఇర్పెన్, బూకా మధ్యలోని ఇంటర్ సెక్షన్ లోకి వచ్చిన రష్యా సైనికులను ఉక్రెయిన్ సోల్జర్లు నిలువరించారని ఉక్రెయిన్ రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నాజీ ఆక్రమణదారులను గోస్టోమెల్ దగ్గర ఉక్రెయిన్ సైనికులు కాల్చేశారని చెప్పారు. ‘‘వాళ్లు కాలిపోతున్నారు. చచ్చిపోతున్నారు. లొంగిపోతున్నారు. ఉక్రెయిన్ జిందాబాద్’’ అంటూ ల్యాండ్ ఫోర్సెస్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. కాగా, ఉక్రెయిన్ ప్రతిదాడుల్లో ఇప్పటిదాకా 2,500 మందిదాకా రష్యా సైనికులు చనిపోయినట్టు ఉక్రెయిన్ రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు.