మూడో రోజు.. ఏ మాత్రం వెన‌క్కుత‌గ్గ‌ని ర‌ష్యా.. ఉక్రెయిన్‌లో బాంబులు వేసిన వైనం

  • కీవ్ లోని ఓ భారీ అపార్ట్‌మెంట్ వ‌ద్ద బాంబు దాడి
  • ఉక్రెయిన్ మొత్తాన్ని అధీనంలోకి తెచ్చుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ర‌ష్యా చ‌ర్య‌లు
  • ఫొటోలు, వీడియోలు షేర్ చేయ‌కూడ‌ద‌ని త‌మ ప్ర‌జ‌ల‌కు ఉక్రెయిన్ సూచ‌న‌
ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. మూడో రోజు కూడా బాంబు దాడులు చేసింది. ఈ రోజు తెల్ల‌వారుజామున  ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని ఓ భారీ అపార్ట్‌మెంట్ వ‌ద్ద బాంబు దాడి జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపింది. మ‌రోవైపు, కీవ్‌లోని ఆర్మీ సైనిక స్థావ‌రంపై ఈ రోజు ర‌ష్యా దాడికి చేసిన ప్ర‌య‌త్నాల‌ను తిప్పికొట్టిన‌ట్లు ఉక్రెయిన్ ప్ర‌క‌టించింది. 

ఉక్రెయిన్ మొత్తాన్ని త‌మ అధీనంలోకి తెచ్చుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా మూడో రోజు కూడా ర‌ష్యా దాడులు చేస్తుండ‌డంతో ర‌ష్యా ద‌ళాలు వెనక్కి వెళ్లాల‌ని ఐక్య‌రాజ్య‌సమితితో పాటు ప‌లు దేశాలు మ‌రోసారి కోరాయి. కాగా, ఉక్రెయిన్‌లో ర‌ష్యా చేస్తోన్న దాడుల‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు క‌ల‌చివేసేలా ఉండ‌డంతో వాటిని షేర్ చేయ‌కూడ‌ద‌ని త‌మ ప్ర‌జ‌ల‌కు ఉక్రెయిన్ ప్ర‌భుత్వం సూచించింది. అమెరికాతో పాటు ప‌లు దేశాలు ర‌ష్యాపై క‌ఠిన‌ ఆంక్ష‌లు విధిస్తున్న‌ప్ప‌టికీ ర‌ష్యా ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా ఉక్రెయిన్‌పై చ‌ర్య‌లు కొన‌సాగిస్తోంది. 





More Telugu News