దేశం కోసం తుపాకీ చేతబట్టి వీధుల్లోకి వచ్చిన ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు

  • ఉక్రెయిన్ పై రష్యా వార్
  • కీవ్ పై పట్టుకోసం ప్రయత్నిస్తున్న రష్యా బలగాలు
  • ఏకే-47 ధరించి కనిపించిన మాజీ అధ్యక్షుడు పోరోషెంకో
  • పుతిన్ కోరి నరకాన్ని కొనితెచ్చుకుంటున్నాడని వ్యాఖ్య  
రష్యా దురాక్రమణ పట్ల ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకో తీవ్రంగా స్పందించారు. ఆయన ఇవాళ ఏకే-47 తుపాకీ చేతబట్టి కీవ్ వీధుల్లోకి వచ్చారు. రష్యా దళాలకు వ్యతిరేకంగా తమ సైనికులతో కలిసి కీవ్ వీధుల్లో పోరాడతానని ప్రకటించారు.

ఓ ఇంటర్వ్యూలో పోరోషెంకో మాట్లాడుతూ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక మూర్ఖుడు, రాక్షసుడు, ఆధునిక తరం హిట్లర్ అని అభివర్ణించారు. ఇవన్నీ పుతిన్ కు వర్తిస్తాయి కాబట్టే ఉక్రెయిన్ ప్రజలను చంపేందుకు వస్తున్నాడని విమర్శించారు.

పుతిన్ కోరి నరకాన్ని కొనితెచ్చుకుంటున్నాడని పోరోషెంకో వ్యాఖ్యానించారు. సాధారణ ప్రజలు సైతం ఇప్పుడు ఉక్రెయిన్ లో తుపాకీ ధరించి రష్యాపై పోరాటానికి సిద్ధపడుతున్నారని, ఇలాంటి ఏక భావన గతంలో ఎన్నడూ చూడలేదని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకువస్తున్నారని తెలిపారు.


More Telugu News