ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న రష్యా వార్నింగ్
- ఆంక్షలు విధిస్తే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌ను కూల్చేస్తాం
- అమెరికా, యూరోప్‌ల మీదుగా కూలుస్తాం
- భారత్, చైనాల మీద కూడా పడుతుంది
- రష్యా స్పేస్ డైరెక్టర్ సంచలన ప్రకటన
ఉక్రెయిన్‌పై యుద్ధోన్మాదంతో పేట్రేగిపోతున్న రష్యా.. తనను నిలువరించేందుకు యత్నిస్తున్న దేశాలను తనదైన శైలి హెచ్చరికలతో బెదిరిస్తోంది. తనపై ఆంక్షలు విధిస్తే.. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌ను కూల్చేస్తామని రష్యా సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు రష్యా స్పేస్ డైరెక్టర్ ఈ భీతావహ ప్రకటనను విడుదల చేశారు.
ఉక్రెయిన్‌తో ఉన్న సమస్యలను చర్చలతోనే పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్య సమితి సహా చాలా దేశాలు రష్యాకు చెప్పాయి. అయితే ఏ దేశం మాట కూడా లెక్కపెట్టని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధానికి తెగబడ్డారు. ఈ క్రమంలో అమెరికా, నాటో దేశాలు రష్యాపై పలు ఆంక్షలను విధించాయి. తాజాగా శుక్రవారం నాడు రష్యాపై అమెరికా సైబర్ దాడులకు దిగింది. పుతిన్ ఆస్తులను ఫ్రీజ్ చేస్తామంటూ యూరోపియన్ యూనియన్ హెచ్చరించింది.
ఈ హెచ్చరికల నేపథ్యంలో ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టే విధంగా రష్యా స్పేస్ డైరెక్టర్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. తమపై ఆంక్షలు విధిస్తే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌ను కూల్చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ సెంటర్‌ను అమెరికా, యూరోప్‌లపై కూల్చేస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. భారత్ లేదంటే చైనాల మీద కూడా స్పేస్ సెంటర్ పడుతుందని కూడా ఆయన సదరు ప్రకటనలో పేర్కొన్నారు.