ఏపీలో ఎన్ఐఏ సోదాల కలకలం
- మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లల్లో సోదాలు
- ప్రజా సంఘాల నేతల ఇళ్లల్లోనూ దాడులు
- గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు
- కేరళ సహా ఏపీలోని 8 చోట్ల సోదాలు
ఏపీలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం నాడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రజా సంఘాలకు చెందిన నేతలతో పాటు గతంలో మావోయిస్టులకు సానుభూతిపరులుగా పనిచేసిన వారి ఇళ్లే టార్గెట్‌గా ఈ సోదాలు జరిగాయి. ఇందులో భాగంగా గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు.
చాపకింద నీరులా మరోమారు మావోయిస్టులు బలం పుంజుకుంటున్నారని, ఈ క్రమంలోనే తమ సంస్థలోకి భారీగా రిక్రూట్‌మెంట్లు జరుపుతున్నారన్న సమాచారంతోనే ఎన్ఐఏ రంగంలోకి దిగినట్లుగా సమాచారం. ఏపీతో పాటు కేరళలో కూడా ఇదే కారణంతో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.