బంకర్ లోకి వెళ్లిపోయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
- కీవ్ నగరానికి చేరుకున్న రష్యా బలగాలు
- అప్రమత్తమైన ఉక్రెయిన్ భద్రతా బలగాలు
- అధ్యక్షుడిని కాపాడుకునేందుకు ఆయనను బంకర్ లోకి పంపిన వైనం
ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరానికి రష్యా బలగాలు చేరుకున్నాయి. దీంతో ఆ దేశ భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. తమ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీని బంకర్ లోకి తరలించాయని సమాచారం వెలువడుతోంది. ఆయనను కాపాడుకునేందుకు సైన్యం ఈ పని చేసినట్టు సమాచారం.
మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఫోన్ చేశారు. ఉక్రెయిన్ సంక్షోభ పరిస్థితులపై వీరిద్దరూ మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇంకోవైపు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా బుకారెస్ట్, రొమేనియా దేశాలకు రెండు ప్రత్యేక విమానాలను పంపుతోంది. రేపు హంగరీ రాజధాని బుడాపెస్ట్ కు ఓ విమానాన్ని పంపుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.