ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంపై తాలిబన్ల కీలక ప్రకటన

  • రెండు దేశాలు సంయమనం పాటించాలన్న తాలిబన్లు
  • చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచన
  • ఉక్రెయిన్ లో ఉన్న తమ విద్యార్థుల గురించి ఆందోళన వ్యక్తం చేసిన తాలిబన్లు
ఉక్రెయిన్ సంక్షోభం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. యుద్ధాన్ని ఆపాలంటూ రష్యాకు పలు దేశాలు విన్నవిస్తున్నాయి. భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపాలని కోరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై ఆఫ్ఘనిస్థాన్ ను పాలిస్తున్న తాలిబన్లు సైతం స్పందించారు.

రెండు దేశాలు సంయమనాన్ని పాటించాలని తాలిబన్ ప్రభుత్వం ఓ ప్రకటనలో కోరింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఉక్రెయిన్ లో తమ విద్యార్థులు చదువుకుంటున్నారన్న తాలిబన్లు... విద్యార్థుల రక్షణపై ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం వల్ల ప్రాణాలు కోల్పోతున్న ప్రజల గురించి ఆవేదన వ్యక్తం చేసింది.


More Telugu News