ఆయుధాలు వ‌దిలితే చ‌ర్చ‌లు.. ఉక్రెయిన్‌కు ర‌ష్యా ఆఫ‌ర్‌

  • ఉక్రెయిన్ సైన్యం పోరాటం ఆపాలి
  • ఆయుధాలు వ‌దిలి లొంగిపోవాలి
  • అప్పుడే ఉక్రెయిన్‌తో చర్చలు 
  • ర‌ష్యా విదేశాంగ‌శాఖ మంత్రి ప్ర‌క‌ట‌న‌
ఉక్రెయిన్‌తో యుద్ధంపై కాసేప‌టి క్రితం ర‌ష్యా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు వ‌దిలితే.. ఆ దేశంతో చ‌ర్చ‌లు జ‌రిపేందుకు తాము సిద్ధ‌మేన‌ని ర‌ష్యా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ర‌ష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీలారోవ్ కాసేప‌టి క్రితం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

సెర్గీలారోవ్ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. ఉక్రెయిన్ సైన్యం త‌క్ష‌ణ‌మే పోరాటం ఆపాలి. త‌మ చేతుల్లోని ఆయుధాల‌ను వ‌దిలేయాలి. ఆపై ర‌ష్యా సైన్యానికి లొంగిపోవాలి. మొత్తంగా ఉక్రెయిన్ సైన్యం త‌మ‌కు స‌రెండ‌ర్ అయిపోతేనే ఆ దేశ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రిపేందుకు తాము సిద్ధ‌మ‌ని ర‌ష్యా ప్ర‌క‌టించింది. మ‌రి ఈ ప్ర‌క‌ట‌న‌పై ఉక్రెయిన్ అధ్య‌క్షుడు ఎలా స్పందిస్తారో చూడాలి.


More Telugu News