బంగారు తెలంగాణ అంటే అమ్ముకుతినుడేనా?: వైఎస్ ష‌ర్మిల‌

  • వైఎస్సార్ హ‌యాం నాటి రాజీవ్ స్వ‌గృహ ప్ర‌స్తావ‌న‌
  • స్వ‌గృహ‌ను ప‌క్క‌న‌ప‌డేశార‌ని ఆవేద‌న‌
  • డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల‌ను వేలానికి పెట్టార‌ని విమ‌ర్శ‌
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అద్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై మ‌రోమారు త‌నదైన పంచు డైలాగుల‌తో విరుచుకుప‌డ్డారు. డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల‌ను కేసీఆర్ స‌ర్కారు వేలానికి పెట్టింద‌ని ఆరోపించిన ఆమె.. కేసీఆర్ గారి బంగారు తెలంగాణ అంటే అమ్ముకతినుడు, అందిన‌కాడికి దోచుకుతినుడే క‌దా అంటూ త‌న‌దైన శైలిలో సెటైర్లు సంధించారు. ఈ సంద‌ర్భంగా త‌న తండ్రి, దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్రారంభించిన రాజీవ్ స్వ‌గృహ ప‌థ‌కాన్ని ఆమె ప్ర‌స్తావించారు.

కాసేప‌టిక్రితం వ‌రుస ట్వీట్ల‌లో ఆమె ఏమ‌న్నారంటే... *రియల్ ఎస్టేట్ దోపిడీ నుంచి పేద మధ్యతరగతి ప్రజలను కాపాడి, వారి సొంతింటి కలను నెరవేర్చాలని సంకల్పించి, మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకే ఇండ్లను అందివ్వాలని రాజీవ్ స్వగృహను రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేస్తే, దొరగారేమో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించుడు పక్కన పెట్టి, మధ్యతరగతి బతుకులు ఎప్పుడు ఇండ్లు లేకుండానే ఉండాలని, కమిషన్ల కోసం, ఖజానా నింపుతం అన్న వంకతో, తన మిత్ర బృందానికి, రియల్ ఎస్టేట్ భజన బ్యాచ్ కు టవర్ల లెక్కన రాజీవ్ స్వగృహ ఇండ్లను వేలానికి పెట్టి జేబులు నింపుకుంటున్నాడు. KCR గారి బంగారు తెలంగాణ అంటే అమ్ముకతినుడు.అందినకాడికి దోచుకునుడే కదా!* అంటూ ష‌ర్మిల సెటైరిక్ విమ‌ర్శ‌లు సంధించారు.


More Telugu News