నా భర్త టార్చర్ పెట్టాడు.. ఇప్పుడు సింగిల్ గానే ఉన్నా: పూనమ్ పాండే
- నా జీవితంలో ఇలా జరగడం దురదృష్టకరం
- నాలాంటి జీవితం మరెవరికీ రాకూడదు
- నేను ఇప్పుడు ఏ జీవిత భాగస్వామి తోడును కోరుకోవడం లేదు
బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండే వైవాహిక జీవితం మూడునాళ్ల ముచ్చటగానే ముగిసిన సంగతి తెలిసిందే. 2020లో సామ్ బాంబేను ఆమె పెళ్లాడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ సామ్ బాంబేను పెళ్లాడిన తర్వాత తాను అనుభవించిన బాధల గురించి చెబుతూ, తీవ్ర భావోద్వేగానికి లోనయింది.
పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త తనను టార్చర్ పెట్టాడని తెలిపింది. ఇలాంటి పరిస్థితి మరే అమ్మాయికి రాకూడదని చెప్పింది. తాను అతన్ని పెళ్లి చేసుకున్నానని, కానీ ఆ తర్వాత తన జీవితంలో దారుణ ఘటనలు జరగడం దురదృష్టకరమని తెలిపింది. ఇది ఒక సిల్లీ విషయమో లేక ఫన్నీ విషయమో కాదని చెప్పింది. ప్రస్తుతం తాను ఒంటరిగానే ఉన్నానని... తాను ఇప్పుడు ఏ భాగస్వామి తోడును కోరుకోవడం లేదని తెలిపింది.
తన భర్త తనను కొడుతున్నాడని పూనమ్ పాండే గృహ హింస కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో ఆమె మాట్లాడుతూ సామ్ తనను కొట్టడం ప్రారంభించాడని, ఒకసారి తనను హత్య చేసినంత పని చేశాడని చెప్పింది. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసిపోయారు. అనంతరం తన భర్త కొడుతున్నాడంటూ ఆమె మరోసారి కేసు పెట్టింది. దీంతో సామ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు.