భీమ్లా నాయక్ డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాలను ఆదుకోవడానికి మాచర్లలో హుండీ ఏర్పాటు
- నేడు భీమ్లా నాయక్ విడుదల
- ఏపీలో థియేటర్లపై నిఘా అంటూ కథనాలు
- డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్ల కోసం హుండీ
- నష్టపోయిన వారికి హుండీలోని సొమ్ము అందజేత
పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం నేడు విడుదలైంది. అయితే, ఏపీ సర్కారు భీమ్లా నాయక్ ప్రదర్శించే థియేటర్లపై నిబంధనల కొరడా ఝళిపిస్తోందన్న కథనాల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
భీమ్లా నాయక్ చిత్రాన్ని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు, ఆ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్ యాజమాన్యాలను నష్టాల నుంచి ఆదుకోవడానికి మాచర్లలో ఓ హుండీ ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఓ సినిమా థియేటర్ వద్ద ఈ హుండీ దర్శనమిస్తోంది. భీమ్లా నాయక్ డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు తాజా పరిణామాలతో నష్టపోతే అందులోని సొమ్మును అందించాలని పవన్ కల్యాణ్ అభిమానులు నిర్ణయించారు.
కాగా, సోషల్ మీడియాలో అభిమానులు పెట్టే రివ్యూలే కాదు, మీడియాలో ప్రముఖ సినీ విమర్శకులు పెట్టే రివ్యూలు సైతం భీమ్లా నాయక్ తిరుగులేని భారీ హిట్ అని చెబుతున్నాయి.