అందుకే ఈ రోజు షర్మిల భర్త అనిల్ నన్ను కలిశారు: ఉండవల్లి
- ఉండవల్లి ఇంటికి వెళ్లిన అనిల్
- పలు అంశాలపై చర్చ
- రాజకీయ అంశాలపై కూడా మాట్లాడుకున్నామన్న ఉండవల్లి
- చర్చి ఓపెనింగ్‌కు వెళ్తూ తమ ఇంటికి వచ్చాడని వివరణ
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌తో వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల భర్త అనిల్ కుమార్ రాజమండ్రిలో సమావేశమయ్యారు. ఉండవల్లి నివాసంలో ఆయనతో అనిల్ కుమార్ పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ కుటుంబంతో పాతికేళ్ల నుంచి పరిచయం ఉందని చెప్పారు.
రాజకీయ కారణాల వల్ల కొంత కాలంగా దూరంగా ఉన్నామని చెప్పారు. ఇప్పుడు అనిల్ వచ్చి మళ్లీ కలవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఓ చర్చి ఓపెనింగ్‌కు వెళ్తూ అనిల్ తన వద్దకు వచ్చారని చెప్పారు. అందుకే ఈ రోజు అనిల్ తనను కలిశాడని చెప్పారు. రాజకీయ అంశాలపై చర్చించారా? అన్న మీడియా ప్రశ్నకు.. తాము రాజకీయ అంశాలతో పాటు అన్ని అంశాలు మాట్లాడుకున్నామని అన్నారు.
ఆంధ్ర, తెలంగాణ, భారత్, ఉక్రెయిన్ అంశాలు ఇలా అన్ని అంశాలపై సరదాగా మాట్లాడుకున్నామని చెప్పారు. పలు అంశాలపై కొన్ని నిమిషాల పాటు చర్చించుకున్నామని తెలిపారు. మనం ఏదైనా చోటుకి వెళ్తుంటే దారిలో తెలిసిన వారి ఇల్లు కనబడితే వారి ఇంటికి కూడా వెళ్తామని అన్నారు. ఆ విధంగానే అనిల్ తమ ఇంటికి వచ్చారని తెలిపారు.
అనంతరం బ్రదర్ అనిల్ మాట్లాడుతూ.. ఉండవల్లి ఏ అంశం గురించయినా బాగా పరిశోధన చేసి మాట్లాడతారని అన్నారు. అరుణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగానే కలిశానని అన్నారు. ఆయన దగ్గర రాజకీయ అంశాలు నేర్చుకోవడానికి వచ్చానని తెలిపారు. మంచి చేయడమే రాజకీయమని అన్నారు. వైఎస్ కుటుంబానికి ఉండవల్లి అత్యంత సన్నిహితుడని అన్నారు. ఆయన తనకు చక్కని సలహాలు ఇచ్చే శ్రేయోభిలాషి అని చెప్పారు. ఏపీ, తెలంగాణ రాజకీయాలతో పాటు పలు అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు.