ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారిని రప్పించడంపై సీఎం జగన్‌ సమీక్ష

  • ఉక్రెయిన్ లో దాదాపు 4 వేల మంది ఏపీ విద్యార్థులు
  • విదేశాంగ శాఖతో చర్చలు జరపాలని ఆదేశించిన సీఎం
  • జపోర్టియా యూనివర్శిటీ అధికారులతో టచ్ లో ఉండాలని సూచన
ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన తెలుగువారిని సురక్షితంగా వెనక్కి రప్పించే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కు జగన్ లేఖ రాశారు. తాజాగా ఉన్నతాధికారులతో ఆయన చర్చలు జరిపారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి అందరూ క్షేమంగా తిరిగొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

ఏపీకి చెందిన విద్యార్థులు దాదాపు నాలుగు వేల మంది ఉక్రెయిన్ లో ఉన్నారు. వీరందరి జాబితాను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. వీరందరికీ ఆహారం, మంచి నీరు వంటి సదుపాయాలను కల్పించేందుకు విదేశాంగ శాఖతో చర్చలు జరపాలని జగన్ ఆదేశించారు. తెలుగు విద్యార్థులు ఎక్కువగా ఉన్న జపోర్టియా యూనివర్శిటీ అధికారులతో టచ్ లో ఉండాలని సూచించారు.


More Telugu News