కంటి చూపును కాపాడే ప్రకృతి ‘ప్రసాదాలు’ ఇవి!
- కంటి ఆరోగ్యానికి విటమిన్ ఏ కీలకం
- విటమిన్ సీ, ఫోలిక్ యాసిడ్ తో మంచి ఫలితాలు
- క్యారెట్లు, ఉసిరి, చిలగడదుంపలు తీసుకోవాలి
జీవనశైలి మారిపోయింది. స్మార్ట్ ఫోన్లతో కళ్లకు విశ్రాంతి కూడా కరవైపోయింది. మరోవైపు తినే ఆహారంలో కావాల్సినన్ని పోషకాలు కూడా ఉండడం లేదు. అన్నీ కలసి కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అందుకే, కంటికి మేలు చేసే వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
క్యారెట్స్..
క్యారెట్ల వినియోగం మన దగ్గర తక్కువ. కారణం ఇవి పెద్దగా రుచి ఉండకపోవడమే. కానీ, క్యారెట్ తో మన కంటికి ఎంతో మేలు జరుగుతుంది. జ్యూస్ మాదిరిగా చేసుకుని వడ కట్టకుండా తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. రోజుకు ఒక క్యారెట్ ను ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. ఒక క్యారెట్ తో మన శరీరానికి కావాల్సిన విటమిన్ ఏ పూర్తిగా అందుతుంది. ఇంకా విటమిన్ బి, కె, సి, ఫైబర్ క్యారెట్ తో లభిస్తాయి.
ఆరెంజ్
మన దగ్గర లభించే కమలా పండ్లు లేదా బత్తాయిని కూడా రోజువారీ తీసుకోవాలి. వీటితో విటమిన్ సి తగినంత లభిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే విటమిన్ సి లోపం ఉండకూడదు. కళ్లకు కూడా విటమిన్ సి ఎంతో అవసరం. ఇవి లభించకపోతే నిమ్మ జ్యూస్ తీసుకున్నా సరిపోతుంది.
ఉసిరి
ఉసిరిలో విటమిన్ సీ తోపాటు మరెన్నో ఔషధ గుణాలున్నాయి. రక్త నాళాల ఆరోగ్యానికి, రెటీనా సమస్యల నివారణకు ఉసిరి తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.
పాలకూర
పాలకూరతో ఫోలిక్ యాసిడ్ కావాల్సినంత లభిస్తుంది. కంటి ఆప్టిక్ నెర్వ్ దెబ్బతినకుండా చూడడంలో దీని పాత్ర ఉంటుంది. అందుకని పాలకూరను తరచూ తీసుకోవడం మర్చిపోవద్దు.
చిలగడదుంప
స్వీట్ పొటాటోగా పిలుచుకునే చిలగడదుంప ఆరోగ్య ప్రదాయని. ఇది కూడా విటమిన్ ఏ లోపాన్ని భర్తీ చేస్తుంది. విటమిన్ ఏ, బీటా కెరోటిన్ రెండు రూపాల్లోనూ ఇందులో ఉంటుంది. కంటి చూపు మెరుగు పడడానికి, కళ్లు పొడిబారకుండా ఉండడానికి సాయపడుతుంది.