ఎన్ఎస్ఈ కేసులో ఆనంద్ సుబ్రమణియన్ అరెస్ట్.. చిత్రా ‘యోగి’ అతడేనా?
- ఎన్ఎస్ఈ గ్రూపు మాజీ ఆపరేటింగ్ ఆఫీసర్
- చిత్రాకు సలహాదారుగా సేవలు
- అతడ్ని ప్రశ్నిస్తే యోగి బయటపడే అవకాశం
ఎన్ఎస్ఈ కొలొకేషన్ కుంభకోణం కేసులో గ్రూపు మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (జీవోవో) ఆనంద్ సుబ్రమణియన్ ను సీబీఐ గురువారం రాత్రి అరెస్ట్ చేసింది. ఈ విషయాన్ని శుక్రవారం ప్రకటించింది. గత మంగళవారం చెన్నైలో సుబ్రమణియన్ ను సీబీఐ అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్టు సమాచారం.
ఎన్ఎస్ఈ సీఈవోగా చిత్రా రామకృష్ణ 2015 ఏప్రిల్ 1 నుంచి 2016 అక్టోబర్ 21 వరకు పనిచేశారు. ఆ సమయంలో చిత్రాకు చీఫ్ అడ్వైజర్ గాను సుబ్రమణియన్ సేవలు అందించారు. ఎన్ఎస్ఈ సర్వర్ నుంచి వేగవంతమైన యాక్సెస్ ను అనుచితంగా కొందరికి ఎన్ఎస్ఈ అధికారులు కట్టబెట్టడమే కోలొకేషన్ స్కామ్. ఎన్ఎస్ఈ ట్రేడింగ్ ప్లాట్ ఫామ్ సేవలను కొన్ని సెకన్ల ముందే వేగంగా కొందరు అందుకునే అవకాశం ఏర్పడింది.
మరోవైపు చిత్రా రామకృష్ణ ఎన్ఎస్ఈ చీఫ్ గా ఉన్న సమయంలో ఆమెను ఓ హిమాలయ యోగి ప్రభావితం చేసినట్టు వెలుగు చూడడం తెలిసిందే. ఈ విషయాన్ని చిత్రా రామకృష్ణ స్వయంగా వెల్లడించారు. దీంతో ఎన్ఎస్ఈకి సంబంధించి కీలక నిర్ణయాలు, ప్రణాళికలు యోగితో చిత్ర పంచుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపైనా సీబీఐ దృష్టి పెట్టింది. గత వారం సుదీర్ఘంగా విచారించింది. ఆ యోగి ఎవరన్నది మాత్రం చిత్రా వెల్లడించలేదు. చిత్రాకు సలహాదారుగా పనిచేసిన సుబ్రమణియన్ ఆ యోగి కావచ్చన్న సందేహాలు నెలకొన్నాయి. సీబీఐ విచారణతో యోగి ఎవరన్నది వెలుగు చూసే అవకాశం ఉంది.