వచ్చే నెలలో ఏపీ శాసన సభ, మండలి బడ్జెట్ సమావేశాలు.. చంద్రబాబు డుమ్మా?

  • వచ్చే నెలలో శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలు
  • వెళ్లాలా? వద్దా? అన్న దానిపై నేతలతో చంద్రబాబు చర్చ
  • వెళ్లడమే మేలన్న మెజారిటీ నేతలు
  • వెళ్లినా మాట్లాడే అవకాశం ఇవ్వరన్న మరికొంతమంది
వచ్చే నెలలో జరగనున్న ఏపీ శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు డుమ్మా కొట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే, టీడీపీ ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రం పాల్గొంటారు. ఈ సమావేశాల్లో పాల్గొనాలా? వద్దా? అనే విషయమై నిన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో చంద్రబాబునాయుడు చర్చించారు. బడ్జెట్ సమావేశాలకు హాజరు కావడమే మంచిదన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమైంది.

రాష్ట్రం అనేక సమస్యల్లో కూరుకుపోయిందని, ప్రభుత్వ విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాబట్టి వీటన్నింటినీ సమావేశాల్లో లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారు. అయితే, తాము హాజరైనంత మాత్రాన మాట్లాడే అవకాశం ఇస్తారన్న నమ్మకం కూడా లేదని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు.

 కాగా, గతేడాది నవంబరులో సాక్షాత్తూ అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు కుటుంబ సభ్యులపై వ్యక్తిగత దూషణలకు దిగడంతో తీవ్ర మనస్తాపం చెందిన చంద్రబాబు సమావేశాల్ని బహిష్కరించి బయటకు వచ్చేశారు.


More Telugu News