బయో ఆసియా-2022: కేటీఆర్, బిల్ గేట్స్ మధ్య చర్చ
- అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న కేటీఆర్
- మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో వర్చువల్ భేటీ
- పలు ప్రశ్నలు అడిగిన కేటీఆర్
- భారత్ ను కొనియాడిన బిల్ గేట్స్
బయో ఆసియా-2022 అంతర్జాతీయ సదస్సులో తెలంగాణ మంత్రి కేటీఆర్, ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక అధినేత బిల్ గేట్స్ తో వర్చువల్ గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు బిల్ గేట్స్ సమాధానాలు చెప్పారు. కరోనా వంటి మహమ్మారులను, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొంటారని కేటీఆర్ అడిగారు.
అందుకు బిల్ గేట్స్ బదులిస్తూ, వైరస్ మహమ్మారులను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు ముమ్మర పరిశోధనలు కొనసాగిస్తున్నారని, పరిశోధన ఫలాలను తాము వినియోగించుకుంటామని తెలిపారు. మున్ముందు కాలంలో అనేక రకాల వైరస్ లు దాడి చేయవచ్చని భావిస్తున్నామని వెల్లడించారు.
ఇక కరోనా కట్టడిలో వ్యాక్సిన్ల పాత్ర అమోఘమని, ప్రధానంగా వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా హైదరాబాద్ ఫార్మా సంస్థల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. కాగా, వ్యాధి నిర్ధారణలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావాల్సి ఉందని బిల్ గేట్స్ అభిలషించారు. కరోనా వేళ భారత్ ఎంతో త్వరగా స్పందించడమే కాకుండా, వ్యాక్సిన్ తయారీ, పంపిణీలో ముందంజ వేసిందని కితాబునిచ్చారు.