యుద్ధం దెబ్బకు అగ్రరాజ్యం మార్కెట్లు ప‌తనం

  • ప్ర‌పంచ‌వ్యాప్తంగా షేర్ మార్కెట్ల ప‌త‌నం
  • భార‌త్‌లో రూ.13 ల‌క్ష‌ల కోట్ల సంప‌ద ఆవిరి
  • అగ్ర‌రాజ్యం మార్కెట్ల‌నూ ప్ర‌భావితం చేసిన యుద్ధం
  • ఆదిలోనే 2.34 శాతం మేర మార్కెట్ ప‌త‌నం
ర‌ష్యా, ఉక్రెయిన్ల మ‌ధ్య గురువారం మొద‌లైన‌ యుద్ధం విశ్వ‌వ్యాప్తంగా ప్ర‌భావం చూప‌డం మొద‌లుపెట్టింది. ఇప్ప‌టికే ఈ యుద్ధం కార‌ణంగా భార‌త్ స‌హా ప‌లు దేశాల మార్కెట్లు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. తాజాగా అగ్ర‌రాజ్యం అమెరికా మార్కెట్ల‌పైనా ఈ యుద్ధం త‌న‌దైన శైలి ప్ర‌భావం చూపింది. ప్రారంభమైన క్ష‌ణాల్లోనే అమెరికా షేర్ మార్కెట్ కుప్ప కూలింది. ఆదిలోనే 2.34 శాతం మేర అమెరికా మార్కెట్లు ప‌త‌నం అయ్యాయి.

తొలి సెష‌న్‌లో.. అది కూడా మార్కెట్లు ప్రారంభం కాగానే 2.34 శాతం మేర అమెరికా మార్కెట్లు ప‌తనం అయ్యాయంటే.. మార్కెట్లు ముగిసేలోగా ఇంకెంత మేర ప‌త‌నం అవుతాయోన‌న్న భయాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. ర‌ష్యా,ఉక్రెయిన్‌ల మ‌ధ్య గురువారం ఉద‌యం యుద్ధం ప్రారంభ‌మైన విష‌యం తెలిసినంత‌నే భార‌త్ షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. మార్కెట్లు ముగిసే స‌మ‌యానికి ఏకంగా రూ.13 ల‌క్ష‌ల కోట్ల మేర సంప‌ద క‌రిగిపోయింది. అమెరికాలోనూ ఇంత‌కంటే ఎక్కువ‌గానే మార్కెట్లు ప‌త‌నం కావ‌చ్చ‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.


More Telugu News