యుద్ధంపై కాసేప‌ట్లో అమెరికా అధ్య‌క్షుడి ప్ర‌క‌ట‌న‌

యుద్ధంపై కాసేప‌ట్లో అమెరికా అధ్య‌క్షుడి ప్ర‌క‌ట‌న‌
  • రాత్రి 11 గంట‌ల‌కు జో బైడెన్ ప్ర‌క‌ట‌న‌
  • ఇదివ‌ర‌కే నాటోకు మ‌ద్ద‌తు ప‌లికి‌న వైనం
  • తాజాగా అమెరికా వైఖ‌రిని వెల్ల‌డించ‌నున్న బైడెన్‌
ర‌ష్యా, ఉక్రెయిన్‌ల మ‌ధ్య గురువారం మొద‌లైన యుద్ధంపై ప్ర‌పంచ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అంత‌ర్జాతీయ స‌మాజం ఈ యుద్ధం విష‌యంలో ఎలాంటి జోక్యం చేసుకోరాదంటూ ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించిన ద‌రిమిలా ఈ ఆందోళ‌న‌లు మ‌రింత‌గా పెరిగాయ‌నే చెప్పాలి.

ఇలాంటి త‌రుణంలో అగ్ర‌రాజ్యం అమెరికా ఎలాంటి అడుగులు వేయ‌నుంద‌న్న విష‌యంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఈ యుద్ధంపై అమెరికా వైఖ‌రి ఏమిటో కాసేప‌ట్లోనే తేలిపోనుంది. ర‌ష్యా, ఉక్రెయిన్‌ల యుద్ధంపై అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ఈ రాత్రి 11 గంట‌ల‌కు ఓ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు.

ర‌ష్యాతో అమెరికా ఏళ్ల త‌ర‌బ‌డి కోల్డ్ వార్ సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ర‌ష్యాకు వ్య‌తిరేకంగానే అమెరికా అడుగులు వేస్తుంద‌న్న‌ది విశ్లేష‌కుల అంచ‌నా. ఆ మాట నిజ‌మేన‌న్న‌ట్లుగా ర‌ష్యాను నిలువ‌రించేలా య‌త్నిస్తున్న నాటో కూట‌మికి మద్ద‌తుగా నిల‌వ‌నున్న‌ట్లుగా ఇదివ‌ర‌కే అమెరికా ప్ర‌క‌టించింది. అయితే ఆ మాట ఉక్రెయిన్‌పై ర‌ష్యా దండెత్త‌క ముందు చేసిన ప్ర‌క‌ట‌న‌. తాజాగా ఉక్రెయిన్‌పై ర‌ష్యా బాంబుల వ‌ర్షం కురిపిస్తున్న నేప‌థ్యంలో అమెరికా ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందోన‌న్న విష‌యంపై యావ‌త్తు ప్ర‌పంచం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది.


More Telugu News