రష్యాకు చెందిన మరో యుద్ధ విమానాన్ని కూల్చివేశాం: ఉక్రెయిన్ ప్రకటన
- ఉక్రెయిన్ పై గర్జించిన రష్యా ఆయుధాలు
- ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాల్లో దాడులు
- రష్యాకు చెందిన 7 విమానాలను కూల్చివేశామన్న ఉక్రెయిన్
- ఉక్రెయిన్ ప్రకటనను ఖండించిన రష్యా
భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 8.50 గంటలకు ఉక్రెయిన్ పై రష్యా దాడులు ప్రారంభించింది. అయితే, రష్యా దాడులను తమ బలగాలు దీటుగా తిప్పికొడుతున్నట్టు ఉక్రెయిన్ చెబుతోంది. ఉదయం నుంచి ఇప్పటివరకు రష్యాకు చెందిన పలు యుద్ధ విమానాలను నేలకూల్చినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది.
తాజాగా రష్యాకు చెందిన మరో యుద్ధ విమానాన్ని కూల్చివేశామని తెలిపింది. ఈ విమానాన్ని లుహాన్స్క్ ప్రాంతంలో తమ బలగాలు కూల్చివేశాయని వెల్లడించింది. ఇప్పటివరకు రష్యాకు చెందిన 7 విమానాలను కూల్చివేసినట్టు తెలిపింది. అయితే, దీన్ని రష్యా ఖండించింది. ఉక్రెయిన్ చెబుతున్న దాంట్లో వాస్తవంలేదని స్పష్టం చేసింది.
మరోపక్క, దాడులపై తమ నిర్ణయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమర్థించుకున్నారు. ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకునే ఉద్దేశం తమకు లేదని, ఉక్రెయిన్ సైనిక స్థావరాలపైనే దాడులు చేస్తున్నామని వెల్లడించారు. ఉక్రెయిన్ సైనిక శక్తిని నిర్వీర్యం చేయడమే లక్ష్యమని వెల్లడించారు.