సీఎం జ‌గ‌న్‌తో ఏపీపీఎస్సీ చైర్మ‌న్ స‌వాంగ్ భేటీ

  • ఉద‌యం ఏపీపీఎస్సీ చైర్మ‌న్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు
  • తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్ కార్యాల‌యానికి స‌వాంగ్‌  
  • సీఎం జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన సవాంగ్  
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) చైర్మ‌న్‌గా గురువారం నాడు ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ స‌వాంగ్ ఆ త‌ర్వాత నేరుగా తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్ కార్యాల‌యానికి వెళ్లిన స‌వాంగ్‌.. సీఎం వైఎస్ జ‌గ‌న్ ను మ‌ర్యాద‌పూర్వంగా క‌లిశారు త‌న‌కు ఏపీపీఎస్సీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చిన జ‌గ‌న్‌కు స‌వాంగ్‌ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

మొన్న‌టిదాకా ఏపీ డీజీపీగా ప‌నిచేసిన స‌వాంగ్‌ను అక్క‌డి నుంచి జ‌గ‌న్ స‌ర్కారు బ‌దిలీ చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రికొన్ని రోజుల పాటు స‌వాంగ్ కు స‌ర్వీసు ఉన్నా.. ఆయ‌న‌కు ఎక్క‌డా పోస్టింగ్ ఇవ్వ‌కుండా నేరుగా ఏపీపీఎస్సీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తున్న‌ట్లుగా జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌క‌టించింది. ఈ ప‌ద‌వి స్వీక‌రించేందుకు సిద్ధ‌ప‌డ్డ స‌వాంగ్ కొన్ని నెల‌ల పాటు ఉన్న త‌న స‌ర్వీసును కూడా వ‌దులుకున్న సంగ‌తి తెలిసిందే.


More Telugu News