మాటల్లేవ్.. రష్యాతో దౌత్య బంధాలను తెంచుకున్న ఉక్రెయిన్
- మిలిటరీ ఆపరేషన్ చేబట్టిన రష్యా
- కాదు అది యుద్ధమేనంటున్న ఉక్రెయిన్
- రష్యాతో దౌత్య బంధాలను తెంచుకున్నట్లు ఉక్రెయిన్ ప్రకటన
రష్యా, ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న యుద్ధం యావత్తు ప్రపంచ దేశాలను భయకంపితులను చేస్తోంది. ఇప్పటికే మిలిటరీ ఆపరేషన్ అంటూ ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. అయితే రష్యా చేస్తున్నది మిలిటరీ ఆపరేషన్ ఏమీ కాదని, రష్యా తమపై యుద్ధానికే తెగబడుతోందని ఉక్రెయిన్ వాదిస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షాన్ని కురిపించగా.. తానేమీ తక్కువ తినలేదన్నట్లుగా రష్యా ఫైటర్ జెట్లను కూల్చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది.
ఇదిలా ఉంటే.. ఇరు దేశాల మధ్య సాగుతున్న పోరు అంతకంతకూ భీకర రూపం దాలుస్తోంది. తమపై దాడికి తెగబడ్డ రష్యాతో ఇకపై తాము దౌత్య సంబంధాలను నెరపేదిలేదని ఉక్రెయిన్ తేల్చేసింది. ఈ మేరకు రష్యాతో దౌత్య సంబంధాలను తెంచేసుకుంటున్నట్టుగా ఉక్రెయిన్ కాసేపటి క్రితం సంచలన ప్రకటన చేసింది.