ఏపీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సవాంగ్
- డీజీపీ పోస్టు నుంచి బదిలీ తర్వాత కొత్త పోస్టింగ్
- ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించిన జగన్ సర్కారు
- ఇందుకోసం సర్వీసును కూడా త్యాగంచేసిన సవాంగ్
నిన్నటిదాకా నేరస్థులను కట్టడి చేసే పోలీసు ఉద్యోగంలో కొనసాగిన ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ రోజు ఖాకీ డ్రెస్ వదిలేశారు. ఎంచక్కా సూటు వేసుకుని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ బాధ్యతల్లోకి ఒరిగిపోయారు. ఐపీఎస్ అధికారిగా ఇంకా కొన్ని నెలల పాటు సర్వీసు ఉన్నప్పటికీ సీఎం జగన్ అభ్యర్థన మేరకు ఆ సర్వీసును వదిలేసుకున్న సవాంగ్.. జగన్ కోరిక మేరకు ఏపీపీఎస్సీ చైర్మన్ పదవిని చేపట్టారు. ఈమేరకు గురువారం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్‌గా సవాంగ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ప్రమాణం చేసిన సవాంగ్‌కు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.