వందలాది మంది మృతి చెందారంటూ మీడియాలో వార్తలు.. మరణాలపై ఉక్రెయిన్ అధికారిక ప్రకటన!
- ఏడుగురు మృతి చెందారు
- తొమ్మిది మందికి తీవ్రగాయాలు
- అమాయక ప్రజలూ మృతి?
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌లో ఇప్పటికే వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు పలు మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ మరణాల సంఖ్యపై అధికారికంగా ఓ ప్రకటన చేసింది.
రష్యా దాడుల్లో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందారని, తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయని తెలిపింది. కాగా, ఉక్రెయిన్లోని కీలక ప్రాంతాల్లో సైనిక స్థావరాలపై రష్యా జరుపుతోన్న దాడుల్లో అమాయక ప్రజలూ బలవుతున్నట్లు తెలుస్తోంది. యుద్ధాన్ని ఆపాలని పలు దేశాలు కోరుతున్నాయి. రేపు జీ7 దేశాల సమావేశం ఏర్పాటు చేయనున్నారు.