ఐదు రష్యా యుద్ధ విమానాలు, ఒక హెలికాఫ్టర్‌ను పేల్చేశాం: ఉక్రెయిన్ ప్రకటన
- ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం
- సమర్థంగా స్పందిస్తోన్న ఉక్రెయిన్ సేనలు
- ప్రధాన నగరాల్లో చర్యలు
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సేనలు సమర్థంగా ప్రతిస్పందిస్తున్నాయి. లుహాన్స్క్ ప్రాంతంలో ఐదు రష్యా యుద్ధ విమానాలు, ఒక హెలికాఫ్టర్‌ను పేల్చేశామని ఉక్రెయిన్ ప్రకటన చేసింది. అలాగే, ప్రధాన నగరాల్లో తమ బలగాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని ప్రకటించింది.
తమ దేశ భద్రత కోసం సైనికులు పూర్థి స్థాయిలో పోరాడతారని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. కాగా, ఉక్రెయిన్లో జనావాసాలపై తాము దాడులు చేయబోమని రష్యా ప్రకటన చేసింది. ఉక్రెయిన్ ఎయిర్బేస్లు, సైనిక స్థావరాలు, ప్రభుత్వ ఆస్తులనే లక్ష్యంగా చేసుకుని పోరాడుతున్నట్లు తెలిపింది.