ముంబై, పూణెలో ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు
- ప్రతీ జట్టు 7 మ్యాచులు
- ప్లే ఆఫ్ మ్యాచ్ లు అహ్మదాబాద్ లో
- నేటి పాలక మండలి సమావేశంలో నిర్ణయం
ఐపీఎల్ మెగా వేడుకకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. లీగ్ దశలో 10 జట్లు 70 మ్యాచ్ లు ఆడనున్నాయి. ముంబై, పూణెలోని నాలుగు స్టేడియాల్లోనే మ్యాచ్ లు నిర్వహించనున్నారు. మార్చి 26న తొలి పోటీ మొదలవుతుంది. మే 29న ఫైనల్ తో మగుస్తుంది. ముంబైలో 55 మ్యాచ్ లు, పూణెలో 15 మ్యాచ్ లు ఉంటాయి.
ఆటగాళ్లు, సిబ్బంది భద్రత కోణంలో లీగ్ మ్యాచ్ లను నాలుగు స్టేడియాలకే పరిమితం చేయనున్నారు. ముంబై, పూణె పక్కపక్కనే ఉండడంతో విమాన ప్రయాణాల అవసరం ఉండదన్నది ఆలోచన. ఐపీఎల్ పాలకమండలి నేడు సమావేశమై నిర్ణయాలు తీసుకోనుంది. ప్లే ఆఫ్ మ్యాచ్ లను అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించే ప్రతిపాదన ఉంది.
ప్రతీ జట్టు వాంఖడే స్టేడియంలో, డీవై పాటిల్ స్టేడియంలో 4 మ్యాచ్ లు, బ్రబౌర్న్ స్టేడియం, ఎంసీయే స్టేడియంలో 3 చొప్పున ఆడనుంది.