యుద్ధం వేళ రష్యాలో ఉన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
- నిన్న రష్యా చేరుకున్న ఇమ్రాన్
- పుతిన్‌తో చర్చలు జరిపేందుకే అంటోన్న పాక్
- రష్యాకు పరోక్షంగా చైనా, పాక్ మద్దతు?
ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రష్యాలో ఉన్నారు. ఆయన నిన్న తన రెండు రోజుల పర్యటనలో భాగంగా మాస్కో చేరుకున్నారు. రష్యాతో సత్సంబంధాలు బలోపేతం చేసుకోవడానికే ఇమ్రాన్ రష్యాకు వెళ్లారని పాక్ చెబుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా చర్యల వేళ ఆయన అక్కడకు వెళ్లడం ఆసక్తి రేపుతోంది. రష్యాకు చైనా, పాక్ పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు కొన్ని రోజులుగా సందేహాలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే.
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఓ పాకిస్థాన్ ముఖ్య నేత రష్యాలో పర్యటించడం ఇదే మొట్టమొదటి సారి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఇమ్రాన్ ఖాన్ భేటీ కావాల్సి ఉంది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఇంధన రంగంలో సహకారం వంటి అంశాలపై చర్చిస్తారని పాక్ నుంచి ప్రకటన వచ్చింది. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఆఫ్ఘనిస్థాన్‌లోని పరిస్థితులపై చర్చిస్తారని పాక్ తెలిపింది. అయితే, యుద్ధం జరుగుతోన్న వేళ ఈ అంశాలపై వారు చర్చిస్తారా? అన్న సందేహాలు వస్తున్నాయి.