పవన్ కల్యాణ్ గారు నన్ను మార్చేశారు: రానా
- నటుడిగా 12 ఏళ్లు పూర్తి చేశాను
- హీరో కావాలంటే ఏం చేయాలో తెలియలేదు
- అప్పుడు నాకు ఎదురైన హీరో పవన్
- మిగతావారికి ఆయన పూర్తిగా డిఫరెంట్ అని చెప్పిన రానా
పవన్ కల్యాణ్ - రానా ప్రధానమైన పాత్రలను పోషించిన 'భీమ్లా నాయక్' ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రానా మాట్లాడుతూ .. " నటుడిగా నా ప్రయాణం మొదలుపెట్టి 12 ఏళ్లు అయింది. కెరియర్ మొదట్లో నా వలన సినిమా చెడిపోకూడదని కొంతమంది దర్శకులు నాకు యాక్టింగ్ నేర్పించారు.
నటుడినయ్యాను .. హీరోను కావడానికి ఏం చేయాలనే కాన్సెప్ట్ మాత్రం నాకు అర్థం కాలేదు. ఆ విషయాన్ని తెలుసుకోవడానికి నేను తిరుగుతున్న రోజుల్లో నాకు ఎదురుపడిన హీరోనే పవన్ కల్యాణ్. ఇంతవరకూ నేను తెలుగు .. హిందీ .. తమిళ సినిమాలు చేశాను. ఎంతోమంది స్టార్స్ తో కలిసి పనిచేశాను.
కానీ పవన్ కల్యాణ్ గారు డిఫరెంట్ .. సమ్ థింగ్ స్పెషల్. నాపై ఆయన ఎంతో ప్రభావం చూపించారు. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలకీ .. పవన్ కల్యాణ్ గారి ద్వారా ప్రభావితం అయిన తరువాత చేసే సినిమాలకి తప్పకుండా తేడా ఉంటుంది. 25వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం నాకు ఉంది" అని చెప్పుకొచ్చాడు.