శ్రీలంక క్రికెటర్ కోసం రోడ్డెక్కిన అభిమానులు.. భానుక రాజపక్సకు చోటు కల్పించాలని డిమాండ్

  • భారత్ టూర్‌కు జట్టును ప్రకటించిన శ్రీలంక
  • భానుకకు దక్కని చోటు
  • ప్లకార్డులు  పట్టుకుని రోడ్డెక్కిన అభిమానులు
మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. నేడు ఇరు జట్ల మధ్య లక్నోలో తొలి టీ20 జరగనుంది. ఇందుకోసం ఇటీవల శ్రీలంక తమ టీ20 జట్టును ప్రకటించగా అందులో భానుక రాజపక్సకు చోటు దక్కలేదు. దీనిపై ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టులో అతడికి చోటు కల్పించాలంటూ ప్లకార్డులు పట్టుకుని రోడ్డెక్కారు. శ్రీలంక బోర్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఇప్పుడీ వ్యవహారం శ్రీలంక క్రికెట్‌లో హాట్ టాపిక్ అయ్యింది. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భానుక రాజపక్స అదరగొట్టాడు. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. శ్రీలంక తరపున 5 వన్డేలు, 18 టీ20లు ఆడాడు. అయినప్పటికీ అద్భుత ఆటతీరుతో అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ రిటైర్మెంట్ ప్రకటించి సంచలనం సృష్టించాడు. అయితే, ఆ తర్వాత రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించి అందరి దృష్టిని మరోమారు ఆకర్షించాడు.


More Telugu News