రేపు విశాఖ కోర్టుకు నారా లోకేశ్

  • చిరుతిళ్ల‌కే రూ.24 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టార‌ని లోకేశ్‌పై క‌థ‌నం
  • స‌ద‌రు ప‌త్రిక‌పై రూ.75 కోట్ల‌కు ప‌రువు న‌ష్టం దావా వేసిన లోకేశ్
  • ఆ కేసు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యేందుకే విశాఖ కోర్టుకు టీడీపీ నేత‌
టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ రేపు (గురువారం) విశాఖ‌ కోర్టుకు వెళ్ల‌నున్నారు. తాను దాఖ‌లు చేసిన ఓ ప‌రువు న‌ష్టం కేసు విచార‌ణ కోసం లోకేశ్ కోర్టుకు హాజ‌రుకానున్నారు. గ‌తంలో విశాఖ ఎయిర్ పోర్టులో నారా లోకేశ్ చిరుతిళ్ల‌కే రూ.25 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టార‌ని, ఆ సొమ్మంతా ప్ర‌జాధ‌న‌మేన‌ని ఓ ప‌త్రిక ఓ సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

ఈ క‌థ‌నంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన లోకేశ్ స‌ద‌రు ప‌త్రిక‌పై ఏకంగా రూ.75 కోట్ల‌కు ప‌రువు న‌ష్టం దావా వేశారు. స‌ద‌రు ప‌త్రిక రాసిన క‌థ‌నం అస‌త్య‌మ‌ని, ఆ ప‌త్రిక పేర్కొన్న తేదీలో అస‌లు తాను విశాఖ‌లోనే లేన‌ని లోకేశ్ నాడే వివరణ ఇచ్చారు. అంతేకాదు, స‌ద‌రు ప‌త్రిక‌పై ప‌రువున‌ష్టం దావా కూడా వేశారు. ఈ దావా విచార‌ణ కోసం లోకేశ్ రేపు విశాఖ కోర్టుకు హాజ‌రు కానున్నారు.


More Telugu News