ఉక్రెయిన్ లో రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయిస్తున్న రష్యా

  • రష్యా, ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు
  • అమెరికా, బ్రిటన్ ఆంక్షలను సైతం లెక్కచేయని పుతిన్
  • ఏ క్షణంలోనైనా ఉక్రెయిన్ పై పూర్తి స్థాయిలో దాడి చేసే అవకాశం
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు ఆంక్షలు విధిస్తున్నా రష్యా అధ్యక్షుడు పుతిన్ లెక్క చేయడం లేదు. ఇప్పటికే ఉక్రెయిన్ లోని రెండు ప్రాంతాలను స్వతంత్ర రాజ్యాలుగా గుర్తిస్తున్నట్టు పుతిన్ ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పలు దేశాలు యూరప్ కు బలగాలను తరలిస్తున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్ లో తమ రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయించే పనిలో నిమగ్నమయింది. కీవ్ లోని రష్యా రాయబార కార్యాలయాన్ని ఉక్రెయిన్ పోలీసులు చుట్టుముట్టారు. మరోవైపు రాయబార కార్యాలయంపై రష్యా జాతీయ జెండాను ఎగురవేయలేదు. ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్ పై రష్యా ఏ క్షణంలోనైనా పూర్తి స్థాయిలో దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే వారం రోజుల్లో పరిస్థితులు మరింత దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి.


More Telugu News