నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేకు లోక్‌సభ నోటీసులు
- రాష్ట్ర విభజనపై సభలో ప్రధాని వ్యాఖ్యలు
- ఆ వ్యాఖ్యలను పత్రికలు తప్పుగా రాశాయని ఎంపీ అరవింద్ ఫిర్యాదు
- స్పీకర్ ఆదేశంతో సభా హక్కుల కమిటీ పరిశీలన, నోటీసుల జారీ
- 72 గంటల్లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశం
తెలంగాణలో ప్రముఖ దినపత్రికలుగా గుర్తింపు పొందిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలకు లోక్ సభ నోటీసులు జారీ అయ్యాయి. లోక్ సభకు చెందిన సభా హక్కులు, నైతిక విలువల విభాగం మంగళవారం నాడు ఈ రెండు పత్రికలకు నోటీసులు జారీ చేసింది.
బీజేపీ యువ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫిర్యాదు మేరకే ఈ నోటీసులు జారీ అయ్యాయి. లోక్ సభ వ్యవహారాలపై తప్పుడు కథనాలు రాయడం ద్వారా సభా హక్కుల ఉల్లంఘనకు, సభ ధిక్కారానికి ఈ పత్రికలు పాల్పడ్డాయని అరవింద్ చేసిన ఫిర్యాదు ఆధారంగానే ఈ నోటీసులు జారీ అయ్యాయి.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మోదీ వ్యాఖ్యలను, సభా వ్యవహారాలను నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు వక్రీకరించాయని, తప్పుగా ప్రచురించాయని ఆరోపిస్తూ స్పీకర్ ఓం బిర్లాకు అరవింద్ ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదును స్పీకర్.. సభా హక్కుల కమిటీకి పంపించారు. దీనిని పరిశీలించిన కమిటీ రెండు పత్రికలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు 72 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆ రెండు పత్రికల సంపాదకులను ఆదేశించింది.