వెంక‌న్న ఆస్తులు ఇక‌ సుర‌క్షితం.. జియో ఫెన్సింగ్ కు టీటీడీ నిర్ణ‌యం

  • దేశవ్యాప్తంగా వెంక‌న్న‌కు స్థిరాస్తులు
  • వాటి ప‌రిర‌క్ష‌ణ‌కు జియో ఫెన్సింగ్‌
  • కీల‌క నిర్ణ‌యం తీసుకున్న టీటీడీ
క‌లియుగ దైవం తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామికి లెక్క‌లేన‌న్ని ఆస్తులు ఉన్నాయి. వ‌డ్డీ కాసుల వాడికి ఆయ‌న భ‌క్తులు భూరి విరాళాల‌ను చెల్లిస్తూనే ఉన్నారు. అందులో కొన్ని స్థిరాస్తులు కూడా ఉన్నాయి. అయితే ఆ ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ‌పై మాత్రం ఇప్ప‌టిదాకా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లాలు అయితే క‌నిపించ‌లేదు. ఇప్పుడు మాత్రం వెంక‌న్న ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) నడుం బిగించింది. ఇందులో భాగంగా వెంక‌న్న ఆస్తుల‌కు జియో ఫెన్సింగ్ చేసేందుకు టీటీడీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

  స్థిరాస్తుల‌కు జియో ఫెన్సింగ్ పై టీటీడీ ఈ రోజు ప‌వ‌ర్ ప్ర‌జెంటేష‌న్‌ను తిల‌కించింది. ఆ త‌ర్వాత వెంక‌న్న ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ‌కు జియో ఫెన్సింగ్ స‌రిగ్గా స‌రిపోతుంద‌ని తీర్మానించింది. వెనువెంట‌నే దేశ‌వ్యాప్తంగా ఉన్న వెంక‌న్న ఆస్తుల‌కు జియో ఫెన్సింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న వెంక‌న్న ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా జియో ఫెన్సింగ్ చేయిస్తున్న‌ట్లుగా టీటీడీ ప్ర‌క‌టించింది.


More Telugu News